24 March, 2026 | 7:46 PM

Breaking News

ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •   కల్లూరు నుండి హైదరాబాద్‌కు బస్సు సర్వీస్   •   కలెక్టరేట్ ముందు టీచర్ల భారీ నిరసన ప్రదర్శన   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన కట్టకొమ్ము తండా సర్పంచ్   •  

సీనియర్ నటుడు రఘునాథరెడ్డి కన్నుమూత

02-02-2026 12:00 AM

ప్రముఖ సినీ నటుడు కలకోట రఘునాథ రెడ్డి శనివారం రాత్రి గుండె పోటుతో కన్నుమూశారు. కాప్రా సర్కిల్ పరిధి ప్రథమపురి కాలనీలో నివసించే కాలకోట రఘునాథరెడ్డి మృతి చెందడంతో సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఎన్నో సినిమాల్లో ఆయన వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి మెప్పించారు. తెలుసు, తమిళం, హిందీ, భోజ్ పురి భాషల్లో సుమారుగా 350కిపైగా సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు.

రఘునాథరెడ్డి నటించిన సినిమాల్లో కలిసుందాంరా, ఒసేయ్ రాములమ్మ, ఇంద్ర, డాన్, తమ్ముడు, లీడర్, శ్రీ రామరాజ్యం, శ్రీ రామదాసు, మల్లీశ్వరి లాంటి సూపర్ హిట్ సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా పలువురు హీరోలకు సపోర్టింగ్ రోల్స్ చేశారు. అయితే కొన్ని రోజుల కిందటే రఘునాథ్ రెడ్డి కొడుకు గుండెపోటుతో మరణించారు. కుమారుడి మరణం తట్టుకోలేకపోయిన రఘునాథ్ రెడ్డి మానసికంగా కుంగిపోయారు. నెలల వ్యవధిలోనే ఇప్పుడు ఆయన కూడా గుండెపోటుతోనే మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇతనికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.