12 May, 2026 | 11:09 AM

Breaking News

సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •   చెట్టుపై పండ్లను తినేందుకు వెళ్లి వలలో చిక్కుకొనిచనిపోతున్న పక్షులు   •  

అంగరంగ వైభవంగా శ్రీ బంగారు మైసమ్మ తల్లి బోనాల వేడుకలు

10-08-2025 07:42 PM

పాల్గొన్న మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ భౌరంపేట్ లోని శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి శ్రావణమాస బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజు మాట్లాడుతూ... శ్రావణమాస బోనాల పండుగ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలన్నారు.

ఈ కార్యక్రమంలో భౌరంపేట్ పిఎసిఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, నిజాంపేట్ కార్పొరేటర్ బాలాజీ నాయక్, కౌన్సిలర్లు శంభీపూర్ క్రిష్ణ, బెంబడి బుచ్చిరెడ్డి, నాచారం మురళి యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, అర్కల అనంత స్వామి ముదిరాజ్, సాయి యాదవ్, షామీర్పేట్ హనుమంతరావు, కోర్ర శంకర్ నాయక్, 125 డివిజన్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ విజయ్ రాంరెడ్డి, పాక్స్ డైరెక్టర్లు అర్కల జీతయ్య, సత్తి రెడ్డి, మహిపాల్ రెడ్డి, 24 వ వార్డు ప్రెసిడెంట్ రమేష్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ఎస్వి సురేందర్ రెడ్డి, ధర్మారెడ్డి, పోలీస్ గోవింద్ రెడ్డి, ఆకుల బాబు, రవీందర్ నాయక్, బైండ్ల గోపాల్, బాలకృష్ణ, విష్ణు  తదితరులు పాల్గొన్నారు.