10-08-2025 07:35:29 PM
పెన్‌పహాడ్: మండలంలోని అనాజీపురంలో గ్రామస్తులు ఆదివారం ముత్యాలమ్మ తల్లికి భక్తిశ్రద్దలతో బోనాలు సమర్పించారు. అలాగే బొడ్రాయి, గ్రామ పొలిమేర దేవతలకు బోనాలు సమర్పించడంతో పాటు యాటలు కోళ్లు బలిచ్చి, నారికేయలు పసుపు కుంకుమలను సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు.