శిఖాంజనేయస్వామి వారికి అభిషేకం
మంగపేట,(విజయక్రాంతి): రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలంలోని శ్రీ హేమాచల(మల్లూరు) లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఆలయ సమీపంలోని శిఖాంజనేయస్వామి వారికి స్నపనం (అభిషేకం) కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజైన శనివారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు, శ్రీ హేమాచల (మల్లూరు) లక్ష్మీ నృసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల నిర్వాహక పూజారులు అమరవాది మురళీ కృష్ణమాచార్యులు, వారి బృందం, శ్రీ హేమాచల లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు ముక్కామల రాజశేఖర శర్మ, అర్చకులు కారంపూడి పవనకుమారాచార్యులు, యేడునూతల ఈశ్వర చందు శర్మ, ముక్కామల వేంకట నారాయణ శర్మ ( బాబీ ), అనిపెద్ది రాజీవ్ నాగ శర్మ తదితరుల ఆధ్వర్యంలో శనివారం 10 గంటలకు శిఖాంజనేయస్వామి వారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సంక్షప్త రామాయణహవనం, చతుస్థానార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.






