ట్రినిటి పాఠశాలలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు
24-08-2024 06:22 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): పట్టణంలోని గౌతమి నగర్ ట్రినిటి పాఠశాలలో ముందస్తు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రైమరీ విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణతో ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. నృత్యాలు చేసి అందరిని అలరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జాన్ థామస్, వైస్ ప్రిన్సిపాల్ బిజ్జు కురివిళ్ళ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






