రైతుల రుణమాఫీపై రాద్ధాంతం వద్దు
మంథని కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటి కార్ కిషన్ జి
మంథని,(విజయ క్రాంతి): రైతుల రుణమాఫీపై రాద్ధాంతం వద్దని మంథని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటి కార్ కిషన్ జీ కోరారు. శనివారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా వాగ్దానాన్ని నెరవేర్చేందుకు రూ.2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నది. కొన్ని సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ కాకపోవడం వారికి కూడా రుణమాఫీ చేయడం తథ్యమన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే వీధుల్లో రాస్తారోకో చేస్తున్నారని, ఏ ఒక్క రైతు రాస్తారోకోలో లేడని, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తారని చెప్పారు. బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో రుణమాఫీ ఎంత చేసిందో కేవలం ఎనిమిది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అంతకు రెట్టింపు చేసింది. ఇది రైతులకు మేలు చేసే ప్రభుత్వమని, రైతుబంధు పేరుతో గుట్టలకు వందల వేల ఎకరాల భూస్వాములకు దోచిపెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులంతా సంతృప్తిగా ఉంటే, వారిని రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ నాయకులకు వ్యవహరిస్తున్నారని, కిషన్ జి విమర్శించారు.






