calender_icon.png 13 November, 2025 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు

13-11-2025 11:36:10 AM

 స్వామివారిని దర్శించుకున్న స్పీకర్ గడ్డం ప్రసాదరావు 

చిన్నచింత కుంట: శ్రీ కురుమూర్తి స్వామిని రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద రావు,రాష్ట్ర పశు సంవర్ధక మత్స్య, డైరీ అబివృద్ధి, క్రీడలు యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి దర్శించుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం సి.సి.కుంట మండలం అమ్మాపూర్ గ్రామం లో పేదల తిరుపతి గా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు(Sri Kurumurthy Swamy Brahmotsavam) వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ కురుమూర్తి  స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కురుమూర్తి స్వామి దేవాలయం వద్ద కు చేరు కోగానే రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య డైరీ అబివృద్ధి, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ,దేవరకద్ర శాసన సభ్యులు జి.మధుసూదన్ రెడ్డి,మహబూబ్ నగర్ శాసన సభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి,వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి,ఆలయ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి లు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.

కురుమూర్తి ఆలయం కొండ దిగువన ఆలయ ప్రధాన రాజగోపురం వద్ద పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం ఆయన మంత్రి వాకిటి శ్రీ హరి,శాసన సభ్యులతో కలిసి మెట్ల మార్గంలో కొండ పై గల ఆలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకోగానే మంగళ వాయిద్యాల తో అర్చకులు సాంప్రదాయం ననుసరించి  అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు.ప్రధాన  ఆలయం లో కురుమూర్తి స్వామి కి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ విశిష్టతను అర్చకులు శాసన సభ స్పీకర్ కు వివరించారు. అర్చకులు శాలువాతో  సత్కరించి ఆశీర్వచనం అంద చేసి తీర్థ ప్రసాదాలు అంద చేశారు. దర్శనం అనంతరం రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొకటి గా నెరవేర్చేందుకు, రాష్టానికి మంచి పేరు వచ్చేలా,,ప్రజా పాలన ప్రభుత్వంను మరో ఐదు సంవత్సరం లు ఉండేలా దీనించాలని,రైతులు,ప్రజలు సుభిక్షంగా ఉండేలా ఆశీర్వదించాలని స్వామి వారిని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్.పి.డి.జానకి, ఆలయ ఈ. ఓ మదనేశ్వర్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ కథలప్ప తదితరులు ఉన్నారు.