13-11-2025 11:33:32 AM
తాడిచర్ల ఓసీపీ లో పనిచేసి ఇంటికి వస్తుండగా ప్రమాదం
ముత్తారం,(విజయక్రాంతి): తాడిచర్ల ఓసిపిలో విధులు ముగించుకుని బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్న ఇద్దరికీ ముత్తారం మండలంలోని ఖమ్మం పల్లి సమీపంలోని సందరేళ్లి వద్ద అడివి పందులు ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని కేశనపల్లి గ్రామానికి చెందిన రాంపేళ్లి శ్రీధర్ (30) మధుకర్ గౌడ్ లకు (25) లు తాడిచర్ల ఓసిపిలో కొంతకాలంగా కాంటాక్ట్ విధులు నిర్వహిస్తున్నారు. విధులు నిర్వహించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా ఎదురుగా అడవి పందులు వచ్చి ఢీకొనడంతో శ్రీధర్ తలకు తీవ్ర గాయాలు కాగా, మధుకర్ కు స్వల్పంగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బంధువులకు సమాచారం అందించడంతో ముత్తారం లో ఆర్ఎంపీ వైద్యుని వద్ద ప్రథమ చికిత్స అందించి, హుటాహుటిన కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.