calender_icon.png 13 November, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాండూరు డీఎస్పీ బీకే రెడ్డి.. డీజీపీ కార్యాలయానికి అటాచ్

13-11-2025 11:41:25 AM

నూతన డిఎస్పీగా యాదయ్య  నియామకం.. 

ఉత్తర్వులు జారీ చేసిన డిజిపి శివధర్ రెడ్డి.

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ డీఎస్పి బాలకృష్ణ రెడ్డిని(Tandur DSP BK Reddy) డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ పోలీస్ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత 21 నెలల పాటు తాండూరు డీఎస్పీగా విధులు నిర్వహించారు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం జరగలేదంటూ డీఎస్పీ బాలకృష్ణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పలు ప్రజాసంఘాలు అప్పట్లో డిమాండ్ చేశాయి. సౌమ్యుడిగా ప్రజలతో మమేకమై విధులు నిర్వహించిన డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి బదిలీ వేటు వేయడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. కాగా నూతన డీఎస్పీగా రాష్ట్ర పౌర సరఫరా శాఖలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న యాదయ్యను  నియమిస్తూ డీజీపీ శివధర్ రెడ్డి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీఎస్పీ బాలకృష్ణారెడ్డిపై హఠాత్తుగా బదిలీ  వేటు పడడం తో తాండూర్ నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశం మారింది.