23 June, 2026 | 2:43 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపండి: ఏబీవీపీ డిమాండ్   •   సీసీ రోడ్డుకి భూమి పూజ   •   సహకార సంఘం ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణం చేపట్టాలి   •   భూక్యారెడ్డితండాలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద ఎక్స్‌రే పరీక్షలు   •   ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా: నియోజకవర్గం ఇన్చార్జి   •   రైతులు విత్తనాల మేళాను సద్వినియోగం చేసుకోవాలి   •   యూరియా కోసం రైతుల ధర్నా.. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే అరెస్ట్   •   పోతారంలో చిన్న వానకే చెరువులా ప్రధాన రహదారి   •   ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్   •   శ్యామా ప్రసాద్ ముఖర్జీ త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం   •  

మెట్టు సాయికుమార్‌కు శ్రీలంక ఆహ్వానం

03-02-2026 01:26 AM

‘యంగ్ లీడర్స్ డైలాగ్’కు తెలంగాణ 

ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్‌కు ఆహ్వానం

హైదరాబాద్, ఫిబ్రవ రి2 (విజయక్రాంతి): ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు శ్రీలంకలో జరిగే బే ఆఫ్ బెంగాల్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 కార్యక్రమానికి తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్‌ను ఆహ్వానించారు. డాక్టర్ కావింద జయవర్దేన (ఎంపీ, నీ గోం బో) ఆహ్వానం పంపించారు. కాన్రాడ్ -అడెనౌర్-స్టిఫ్టంగ్, శ్రీలంక యువ పార్లమెంటు సభ్యుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరుగనుంది.  బ్లూ ఎకనామీ, క్లైమేట్ రెసిలియెన్స్, కోస్టల్ గవర్నెన్స్‌కు సంబంధించిన సవాళ్లు, అవకాశాలపై చర్చించేందుకు బే ఆఫ్ బెంగాల్ ప్రాంతానికి చెందిన యువ రాజకీయ నాయకులు, కొన్రాడ్ అడెనౌర్ స్కూల్ ఫోర్ యంగ్ పాలిటిషియన్స్, పూర్వ విద్యార్థులు, నిపుణులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ప్రసంగిస్తారు.