calender_icon.png 3 February, 2026 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనపై పార్లమెంట్‌లో చర్చ పెట్టాలి

03-02-2026 01:25:03 AM

  1. కులగణన చేయకపోతే ఢిల్లీ గద్దె దించుతాం
  2. మాట తప్పితే దేశవ్యాప్తంగా అగ్గి రాజేస్తాం..
  3. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

ముషీరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాం తి): త్వరలో దేశ వ్యాప్తంగా జరగనున్న జాతి జనగణనలో బీసీ కులగలన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు  జాజు ల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ కులగణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గితే ఢిల్లీలోని ప్రభుత్వాన్ని బీసీలు ఏకమై గద్దె దించుతారని తీవ్రంగా హెచ్చరించారు.

ఈ మేరకు సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణతో కలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. 1931లో జరిగి న కులగనణ తర్వాత బీసీల మూడు దశాబ్దాల పోరాట ఫలితంగా గత సంవత్సరం ఏప్రిల్ 30న ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో జనగ ణనతో పాటు కుల గణనలను కూడా చేపడతామని నిర్ణయం తీసుకున్నారని, మాట తప్పితే దేశ వ్యాప్తంగా అగ్గి రాజేస్తామ న్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ను తక్షణమే సవరించి ఓబీసీ కాలమ్ చేర్చాలన్నారు. దేశ వ్యాప్తంగా సమగ్ర కులగననపై ప్రస్తుత బడ్జెట్ పార్లమెంట్ సమా వేశాలలో ప్రత్యేక చర్చ పెట్టాలన్నారు. బీసీ కులగన చేయకపోతే 27 మంది ఓబీసీ కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని డిమాం డ్ చేశారు. బీసీ ప్రస్తావనలే కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ప్రతులను చించి నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కిం గ్ ప్రెసిడెంట్ కులకచర్ల శ్రీనివాస్‌ముదిరాజ్, బీసీ విద్యార్థి సం ఘం జాతీయ అధ్యక్షుడు  తాటికొండ విక్రమ్‌గౌడ్, ఉప్పరి శేఖర్ సాగ ర్, దీటి మల్లయ్య, ఈడిగ శ్రీనివాస్‌గౌడ్, సత్యరాజుగౌడ్, గూడూరు భాస్కర్‌మేరు, విజయలక్ష్మి, కరుణ, ఇంద్రమ్ పాల్గొన్నారు.