26 March, 2026 | 3:39 AM

టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా దారం శ్రీనివాస్ రెడ్డి, సంగేం లక్ష్మణరావు

26-03-2026 01:00 AM

ముకరంపుర, మార్చి 25 (విజయక్రాంతి): టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా దారం శ్రీనివాస్ రెడ్డి, సంగేం లక్ష్మణరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం నగరంలోని టీఎన్జీవో భవన్లో జిల్లా టీఎన్జీవోల సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఎన్నికల అధికారిగా టీఎన్జీవోల కేంద్ర సంఘం మాజీ ఉపాధ్యక్షులు సుద్దాల రాజయ్య గౌడ్, జిల్లా ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర కార్యదర్శి రాగి శ్రీనివాస్ లు నూతన కమిటీని ఏకగ్రీవంగా ప్రకటించారు.

అసోసియేట్ అధ్యక్షులుగా ఒంటెల రవీందర్ రెడ్డి, కోశాధికారిగా ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులుగా గంగారపు రమేష్ గౌడ్, ఇరుమల్ల శారద, గోవిందపతి శ్రీనివాస్, సబితా రెడ్డి ముద్దసాని సునీత, పి శంకర్, వి ప్రసాద్, ఎన్ అనిల్ కుమార్, పెట్టేం శ్రీనివాస్ లతో పాటు కమిటీని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో టిఎన్జీవోల కేంద్ర సంఘం నా యకులు, మాజీ కార్యదర్శి ఎంఏ హమీద్, గూడ ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హర్మీందర్ సింగ్, హరికృష్ణ, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, కార్యదర్శి వెలిచాల సుమంతరావు, పెం డ్యాల కేశవరెడ్డి, నారాయణరెడ్డి, రాజిరెడ్డి, కోడూరి వాస్తవి గౌడ్, కార్యదర్శి కోమ్మేర శ్రీనివాస్ రెడ్డి, శైలజ, లత, నారాయణ, శ్రీనివాస్, సికందర్, మునిబాబు, వంశీ, అల్లె శ్రీనివాస్, లక్షీకాంతయ్య, రాజయ్య, మంజీత్ సింగ్, నవాబ్ నాసు, కోట రామస్వామి,  తదితరులు పాల్గొన్నారు.