28 June, 2026 | 2:10 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

06-04-2025 05:31 PM

శోభాయమానంగా శ్రీరాముడి శోభాయాత్రలు..

భారీ పోలీసు బందోబస్తు..

బైంసా (విజయక్రాంతి): నిర్మల్, భైంసాలో ఆదివారం శ్రీ రామ నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నిర్మల్ లోని దేవరకోట, భైంసాలో గోశాల నుంచి శ్రీరాముని శోభయాత్రలను ఉత్సవ కమిటీలు పూజలు చేసి ప్రారంభించారు. ఎంపీ నగేష్, ఎమ్మెల్యే రామారావు పటేల్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో రెండు పట్టణాల్లో ఇద్దరు ఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర మార్గంలో ఉన్న సీసీటీవీ లను పొలీస్ స్టేషన్ పరిధిలో గల కంట్రోల్ రూం లో అనుసంధానం చేసి గట్టి  నిఘాను ఏర్పాటు చేశారు.