4 March, 2026 | 12:33 AM

ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు

03-03-2026 09:26 PM

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఐపీఓ గౌని సురేష్ గౌడ్

గరిడేపల్లి,(విజయక్రాంతి): శ్రీ రామ నవమి వేడుకలలో భాగంగా భద్రాద్రి (భద్రాచలం)లో నిర్వహించే శ్రీ సీతా రామచంద్రస్వామి కళ్యాణోత్సవంలోని పవిత్ర “తలంబ్రాలు” ప్రసాదాన్ని రాష్ట్రంలోని అన్ని పోస్టాఫీసుల ద్వారా భక్తుల ఇళ్లకు నేరుగా పంపిణీ చేసే ప్రత్యేక సేవను అందిస్తోందనీ హుజూర్నగర్ సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ (ఐపిఓ) గౌని సురేష్ గౌడ్ తెలిపారు.

మంగళవారం గరిడేపల్లి లోవిడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ... 27 మార్చి 2026న భద్రాచలంలో నిర్వహించనున్న శ్రీరామనవమి మహోత్సవాలకు భద్రాద్రికి వెళ్లలేని భక్తులు పవిత్ర తలంబ్రాలను పొందేందుకు గతంలో మాదిరిగానే తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ (ఎండోమెంట్స్)సహకారంతో రాష్ట్రంలోని అన్ని పోస్టాఫీసుల ద్వారా భక్తులు క్రింది సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ తలంబ్రాలను స్వీకరించడానికి ఈనెల 20 వరకు చివరి తేదీ నిర్ణయించడం జరిగిందన్నారు..

 సేవ పేరు — ప్రసాద వివరాలు — సేవా రుసుము

1. అంతరాలయ అర్చన – కళ్యాణ తలంబ్రాలు

భద్రాచల సీతారామ స్వామి కళ్యాణ తలంబ్రాలు ప్యాకెట్ (1ముత్యం, కుంకుమ, మిశ్రీ, కాజు గింజలు కలిగి ఉంటుంది) దీనికి గాను రుసుo రూ. 450 స్థానిక పోస్ట్ ఆఫీస్ లో చెల్లించవచ్చని తెలిపారు.

2. ముత్యాల తలంబ్రాలు

భద్రాచల సీతారామ స్వామి కళ్యాణ తలంబ్రాలు ప్యాకెట్ (1 ముత్యం కలిగి ఉంటుంది) దీనికి రుసుం రూ.151 దగ్గర్లను పోస్ట్ ఆఫీస్ లో చెల్లించి పేరు నమోదు చేసుకోవాలి. భక్తులు అవసరమైన రుసుమును మీకు దగ్గరలోని ఏ పోస్టాఫీసులోనైనా చెల్లించి ఈ అవకాశాన్ని పొందవచ్చు అని తెలిపారు శ్రీ సీతా రామచంద్ర స్వామి కళ్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను స్పీడ్ పోస్టు ద్వారా భక్తుల గృహలకు పంపిణీ చేయబడతాయాని,స్వామివారికి కళ్యాణాన్ని స్వయంగా వీక్షించలేని వారికి ఈ అవకాశం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.