11 July, 2026 | 1:51 AM

శ్రీ శ్రీ.. ప్రేమ మళ్లీ చిగురిస్తుంది!

11-07-2026 12:00 AM

హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో దుల్కర్ సల్మాన్ సరసన పూజా హెగ్డే తొలిసారిగా నటిస్తోంది. చిత్ర నిర్మాతలు తాజాగా ఈ మూవీ టైటిల్‌తోపాటు, ప్లజెంట్ ఫస్ట్-లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

‘శ్రీ శ్రీ’ అనే పేరును ఖరారు చేసుకున్న ఈ సినిమాకు ‘లవ్ విల్ స్పార్క్ అగైన్’ అనేది ట్యాగ్‌లైన్. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే మధ్య ఉన్న సహజమైన కెమిస్ట్రీ ఆకర్షణీయంగా ఉంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అనయ్ ఓం గోస్వామి; సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా.