27 April, 2026 | 4:05 AM

ఘనంగా శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మాత జన్మదినం

27-04-2026 01:20 AM

గాంధారి , ఏప్రిల్ 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఆర్యవైశ్యుల కులదైవం  శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినం  ఘనంగా నిర్వహించారు. మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వారి సంఘం భవనం నుండి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక అలంకరణ చేసిన రథంపై  కోలాటాలతో ఘనంగా ఊరేగించారు.

అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నిర్మించు చోట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఉత్సవ విగ్రహానికి వేద బ్రాహ్మణులచే పంచామృతాలతో అభిషేకం, గణపతి విగ్రహానికి  అభిషేకం, కుంకుమ అర్చనలు చేసి అన్న ప్రసాద వితరణ నిర్వహించారు.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినాన్ని రాష్ట్ర పండగగా గుర్తించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఆర్యవైశ్య సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బెజుగం సంతోష్, ఉపాధ్యక్షులు బొంపల్లి రాజులు, కోశాధికారి తాటి విశ్వేశ్వర్, మధుసూదన్ కార్యదర్శి కొండ మహేష్, తాటి లింగమూర్తి , పత్తి శ్రీధర్ , ఆంజనేయులు, తాటి రమేష్,  ప్రశాంత్ కుమార్, లక్ష్మీకాంత్, సోమశేఖర్, ప్రవీణ్, తాటి సుదర్శన్, ఆర్యవైశ్య సంఘ సభ్యులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరాలయ నిర్మాణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.