27 April, 2026 | 4:06 AM

ఐవీఎఫ్ కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫ్రూట్ బౌల్స్ పంపిణీ

27-04-2026 01:18 AM

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి సందర్భంగా 3000 వేల మందికి అందజేత

కామారెడ్డి, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా గుర్తించడంతో కామారెడ్డి  ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో 3000 వేల మందికి ఫ్రూట్ బౌల్స్ పంపిణి చేయడం జరిగిందని ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్, ఐవిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరి మారుతి,యువజన విభాగం అధ్యక్షులు ఎర్రం ఈశ్వర్ లు తెలిపారు.

ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త సూచనల మేరకు మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు అన్నారు.ఈ సందర్భంగా ఐవిఎఫ్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా 3000 మందికి ఫ్రూట్ బౌల్స్ పంపిణీ చేయడం జరిగిందని,అమ్మవారు ప్రపంచానికి తెలియజేసిన అహింసా,సేవా మార్గం, త్యాగనిరతిని వైశ్యులందరూ కలిగి ఉండాలని,ఐక్యంగా ముందుకు వెళ్తే సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి సాధించడం జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, కోశాధికారి కస్వ వెంకటేష్, నంగునూరి కాశీనాథం,యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కౌడ ప్రవీణ్,ఎర్రం చరణ్ కుమార్,మోటుకూరి అమర్నాథ్, పశుపతి,రాకేష్,సంపత్,శ్యాం సుందర్,అఖిల్, గంగాధర్,సాయి తేజ, అన్వేష్, వెంకటేష్ లు పాల్గొన్నారు.