16 April, 2026 | 12:06 PM

Breaking News

వీధి కుక్కల దాడి.. మృత్యువుతో పోరాడి— 15 రోజుల తర్వాత బాలుడు మృతి   •   కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •  

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ భూముల కౌలు వేలం పాట..

29-05-2025 06:05 PM

మునగాల: సూర్యాపేట జిల్లా(Suryapet District) మునగాల మండల పరిధిలోని బరాకత్ గూడెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములను గురువారం దేవాదాయ శాఖ అధికారులు కౌలు వేలంపాట నిర్వహించారు. దేవాలయానికి చెందిన 25 ఎకరాలను అధికారులు వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటకు సుమారు 300 మంది రైతులు పాల్గొనగా ఎనిమిది మంది మాత్రమే డిపాజిట్ కట్టి వేలంలో పాల్గొన్నారు. 19 ఎకరాలు చెందిన భూమిని రావణ పోయిన హుస్సేన్ దక్కించుకోగా, మరో ఆరు ఎకరాల బాడువాను దాసరి సైదులు దక్కించుకున్నాడు. ఈ వేలం పాటలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వేలంపాట పర్యవేక్షకులు తుమ్మల వెంకట చలపతి, ఆలయ ఈవో సత్యనారాయణ, దేవాలయ చైర్మన్ పోలిశెట్టి శ్రీనివాసరావు, ధర్మకర్తలు ఇనుగుర్తి వీరాచారి, గోవింద రామారావు, తులసి, గుడిపాటి వెంకటరమణ, గ్రామ పెద్దలు కాలే సామెల్ గడ్డం చంద్రారెడ్డి ఓరుగంటి రవి వేనేపల్లి రమేష్ బాబు నరాల వెంకటేశ్వరరావు రణబోతు వీరారెడ్డి రణబోతు రామిరెడ్డి ఎస్కే రంజాన్ మాలు బోనాల కోటేష్ బొంతు విజయ్ తదితరులు పాల్గొన్నారు.