calender_icon.png 23 February, 2026 | 5:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ లో శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

23-02-2026 04:01:13 PM

దేవాలయం చైర్మన్ పల్ల మురళీధర్

అర్చకులు సౌమిత్రి శ్రావణ్ కుమార్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ సంతాన వేణుగోపాలస్వామి మరియు తిరుకళ్యాణ మహోత్సవం అధ్యాయ నోత్సవ ప్రయుక్త బ్రహ్మోత్సవ వేడుకలు ఈ నెల 25 బుధవారం నుండి వచ్చే నెల ఒకటి ఆదివారం వరకు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని దేవాలయం చైర్మన్ పల్ల మురళీధర్, అర్చకులు సౌమిత్రి శ్రావణ్ కుమార్ లు తెలిపారు, సోమవారం వారు మాట్లాడుతూ 25 న బుధవారం తోలక్కం  ప్రబంధ  సేవా కాలం , తీర్థ ప్రసాద వితరణ,  26న గురువారం  దివ్య ప్రబంధ సేవా కాలం తో పాటు పలు పూజా కార్యక్రమాలు ఉంటాయి.

27 న శుక్రవారం  అంకురార్పణ, రక్షాబంధనం, వివ్య కేసన ఆరాధన, పుణ్యహవచనం తోపాటు సాయంత్రం నాలుగు గంటల నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఎదురుకోళ్ల కార్యక్రమం, భక్త బృందం కోలాటాలతో స్వామివారి ఊరేగింపు పల్లకి సేవ నిర్వహించడం జరుగుతుందని, అనంతరం తిరు కళ్యాణ మహోత్సవం, హవనం, బలిహరణం ఉంటుందని, 28న శనివారం సుదర్శన హోమం ,స్వామివారి అలక ఉత్సవం, పలు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

1న ఆదివారం ఉదయం 9 గంటలకు రథ హోమం , రథోత్సవం, శ్రీ గుడి మిట్టపల్లి శివాలయంలో చక్ర తీర్థ స్నానం, శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో మహా పూర్ణహుతి, శ్రీ పుష్పయాగం, ద్వదశవర్నాలు, పరలింపు సేవ, (ఉంజాల్) సేవ అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేయుట జరుగుతుందని, దీంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై ఈ కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలని చైర్మన్ పల్ల మురళీధర్, ఆలయ అర్చకులు సామిత్రి శ్రావణ్  కుమారు లు కోరారు.

బ్రహ్మోత్సవాల కు ఎమ్మెల్యే విజ్జన్న పావని దంపతులకు ఆహ్వానం

ఈ నెల 25 నుండి మార్చి ఒకటో తారీకు వరకు జరుగు శ్రీ సంతానవేణుగోపాలస్వామి  బ్రహ్మోత్సవాల కు హాజరు కావాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పావని దంపతుల కు చైర్మన్ పల్లా మురళీధర్ , ఆలయ అర్చకులు సామిత్రి శ్రావణ్ కుమారు లు ఆహ్వాన పత్రిక ను అందజేశారు, తప్పకుండా బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటానని ఎమ్మెల్యే విజయ రమణారావు చెప్పారని వారు తెలిపారు.