calender_icon.png 23 February, 2026 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లంపేట చైర్మన్ కు... శుభాకాంక్షలు వెల్లువ

23-02-2026 06:27:43 PM

పాల్గొన్న జవహర్ నగర్ మాజీ కార్పొరేటర్లు

జవహర్ నగర్,(విజయక్రాంతి): ఎల్లంపేట మున్సిపల్ నూతన చైర్మన్ గా శ్రీదేవి బాధ్యతల స్వీకరించారు. ఈ మేరకు సోమవారం ఎల్లంపేట మున్సిపాలిటీ కార్యాలయంలో శ్రీదేవిని జవహర్ నగర్ మాజీ కార్పొరేటర్లు సంగీత రాజశేఖర్, పల్లపు రవి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ... అభివృద్ధి పనులలో వేగం పెంచుతానని ఎల్లంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానన్నారు.

రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు దీపాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని, ఎల్లంపేట మున్సిపాలిటీని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తానని తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా ప్రత్యేక ప్రణాళికల ద్వారా ఎల్లంపేట అభివృద్ధికి వివిధ ప్రణాళికలను అమలు చేస్తానని తెలిపారు. కెసిఆర్ ఆశయాలను, కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.