calender_icon.png 23 February, 2026 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారి ఆక్రమణ.. అధికారుల ఆగ్రహం

23-02-2026 06:24:44 PM

తొలగించుకుంటే మేమే తొలగిస్తాం: డిపిఓ మనోజ 

అచ్చంపేట: రహదారిని ఆక్రమించి చట్టవిరుద్ధంగా నిర్మాణాలు ఉంటే వాటిని తామే తొలగిస్తామని అచ్చంపేట మున్సిపాలిటీ పట్టణ ప్రణాళిక అధికారి (టిపిఓ) మనోజ హెచ్చరించారు. పట్టణంలోని 15వ వార్డు పరిధిలోని అచ్చంపేట- లింగాల ప్రధాన రహదారి సమీపంలో ఇంటర్నల్ రోడ్డును ఆక్రమించి కొంతమంది నిర్మాణాలు చేపట్టారు. దీనిపై స్థానిక నివాసా యజమానులు అభ్యంతర వ్యక్తం చేశారు. 10 ఫీట్లు ఉన్న రోడ్డును ఆక్రమించడం వలన ప్రస్తుతం నాలుగు ఫీట్లు కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

రోడ్ ఆక్రమణలు తొలగించాలని ఇప్పటికే అనేకసార్లు మున్సిపల్ అధికారులకు తెలియజేసిన స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ఆక్రమించడం వలన.. మెయిన్ రోడ్డు నుంచి ఇళ్లకు నీటి కనెక్షన్ ఇచ్చుకోవాలంటే ఇబ్బందిగా మారిందని చెప్పారు. పైప్ లైన్ ఏర్పాటు చేసుకోవాలని చూస్తే రహదారి ఇరుకుగా ఉండడంతో.. ఇబ్బందిగా మారిందని చెప్పారు. ఇదే విషయాన్ని స్థానికులు వార్డు కౌన్సిలర్ మనోహర్ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో సోమవారం టిపిఓ మనోజ, ఏఈ రాజ్యా నాయక్, కౌన్సిలర్ మనోహర్ ప్రసాద్ రహదారి ఆక్రమణకు గురైన ప్రాంతానికి వెళ్లారు. ఆక్రమణలు తొలగించి వాహనాలు వెళ్లేలా చూడాలని  కాలనీవాసి, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ తారాసింగ్ అధికారులను కోరారు. రోడ్డును ఆక్రమించిన వారిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా ఆక్రమణలు తొలగించకుంటే జెసిబి సాయంతో తామే తొలగిస్తామని హెచ్చరించారు. రోడ్డు ఆక్రమించిన వ్యక్తి తొలగిస్తామని అధికారులకు హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు.