బీఎస్‌పీ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జిగా శ్రీహరి చారి
మేడ్చల్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్చార్జిగా ముల్లంగిరి శ్రీహరి చారి నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ అందజేశారు. చీఫ్ సెక్టార్ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్, సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ అతర్ సింగ్ రావు, రాష్ట్ర కోఆర్డినేటర్ బి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది.
మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, బహుజన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సూచించారు. ఈ సందర్భంగా శ్రీహరి చారి మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తన నియమకానికి కృషిచేసిన రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్, చీఫ్ సెక్టార్ కోఆర్డినేటర్, సెంట్రల్ సెక్టార్ కోఆర్డినేటర్, రాష్ట్ర కోఆర్డినేటర్ కు కృతజ్ఞతలు తెలిపారు.






