12-11-2025 10:12:46 PM
బెజ్జూర్ (విజయక్రాంతి): బెజ్జూర్ మండల పంచాయతీ అధికారి గాజుల శ్రీనివాస్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల వెలువడిన గ్రూప్-2 ద్వారా సెలెక్ట్ అయ్యి మొదటి పోస్టింగ్ బెజ్జూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. బెజ్జూర్ లో విధులు నిర్వహించిన ఇంచార్జ్ ఎంపీఓ గౌరీ శంకర్ కాగజ్నగర్ బదిలీపై వెళ్లారు.