calender_icon.png 12 November, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ వాహనాన్ని ఢీకొన్న లారీ

12-11-2025 10:14:53 PM

కానిస్టేబుల్ కు గాయాలు..

కామారెడ్డి 44వ జాతీయ రహదారిపై ఘటన..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి 44వ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రహదారి పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొనడంతో వాహనంలో ఉన్న కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. కామారెడ్డి పట్టణ సమీపంలోని 44వ జాతీయా రహదారి సిరిసిల్ల రోడ్డు బైపాస్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసు వాహనాన్ని వెనుక నుంచి ఢీకొన్న లారీ పరారీ అయినట్లు తెలుస్తోంది. గాయపడిన కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో గాయపడిన కానిస్టేబుల్ చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ పరారీపై సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.