15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రమాదాలు జరిగితే తప్ప అధికారులు పట్టించుకోరా..?

12-11-2025 10:11 PM

మరమ్మతులు వెంటనే చేపట్టాలి..

బెజ్జూర్ (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని సోమిని నుండి మొగలి వరకు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రమాదంకరంగా గుంతలు ఏర్పడ్డాయి. వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు కల్వర్టుల వద్ద ప్రమాదకరంగా గుంతలు ఏర్పడ్డాయి. ఈ రహదారి గుండా గిరిజన గ్రామాలకు, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు ప్రతినిత్యం వేలమంది ప్రయాణిస్తుంటారు. ప్రమాదకరంగా గుంతలు ఏర్పడ్డాయని గ్రామాల ప్రజలు ప్రయాణికులు సైతం అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

గతంలో బీటి రోడ్డు వేసిన కాంట్రాక్టర్ నాణ్యతతో పనులు చేపట్టకపోవడంతో ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా గుంతలు ఏర్పడ్డాయని ప్రయాణికులు తెలుపుతున్నారు. అహిరి, ఆళ్లపల్లి వారసంతలకు వెళ్లి కూరగాయల వ్యాపారులు రాత్రి సమయంలో గమనించక వాహనాలు గుంతలలో పడి ప్రమాదాలు జరిగితే బాధ్యులు ఎవరని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలు ఏర్పడ్డ ప్రాంతాల్లో మరమ్మత్తులు చేసి ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.