13 April, 2026 | 9:26 PM

సుల్తానాబాద్‌లో ఘనంగా శ్రీ పాదరావు వర్ధంతి వేడుకలు

13-04-2026 08:17 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో  మండల పార్టీ అధ్యక్షులు చిలుక సతీష్  ఆధ్వర్యంలో సోమవారం  నిర్వహించిన మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు  27వ వర్ధంతి వేడుకలకు ముఖ్య అతిథిగా  పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  అంతటి అన్నయ్య గౌడ్ పాల్గొన్నారు. శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్  మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేసిన అభివృద్ధి ఆయన చేసిన సేవలు మరువలేను అని కొనియాడారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దుదిల్లా శ్రీధర్ బాబు,  జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్,  ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట  విజయ రమణారావు  ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా  నడి బోడ్డున మాజీ స్పీకర్ స్వర్గీయులు శ్రీపాద రావు  విగ్రహం తయారై ఉంది అని ,మళ్లీ జయంతి ఉత్సవాల వరకు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటామని అన్నయ్య గౌడ్ అన్నారు, ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చిలుక సతీష్ , మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్పర్సన్ అంతటి పుష్పలత, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబ్బయ్య గౌడ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.