24 March, 2026 | 8:33 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

హంస వాహనంపై శ్రీవారు

06-10-2024 01:57 AM

తిరుపతి మాడ వీధుల్లో భక్తులకు దర్శనం

వైభవంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు

హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాం తి): తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాత్రి 7 గంట ల నుంచి 9 గంటల వరకు హంస వాహనసేవ నిర్వహించారు.

అంతకుముందు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, ఉదయం 10 గంటలకు చిన్నశేష వాహన సేవ నిర్వహించారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషు డిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపం చం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శించే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

తిరుమల పవిత్రతను కాపాడాలి: ఏపీ సీఎం చంద్రబాబు

తిరుమల ఆలయ పవిత్రతను, నమ్మకా న్ని కాపాడేలా అధికారులు పనిచేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించా రు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని, ప్రశాంతత కు ఎక్కడా భంగం కలగకూడదని సూచించా రు. ఏ విషయంలో రాజీపడొద్దని, భవిష్యత్తు నీటి అవసరాలకు ముందుస్తు ప్రణాళికలు రచించాలన్నారు.

ప్రసాదాల నాణ్యత ఎల్లప్పుడు కొనసాగించి మరింత మెరుగుప ర్చాలని, తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలన్నారు. ప్రముఖులు వచ్చినప్పుడు హడా వుడి కనిపించకూడదని చెప్పారు. భక్తుల పట్ల టీడీడీ సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. రెండు రోజు పర్యటనలో అత్యాధునిక వకుళామాత సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రారంభించారు.