29 April, 2026 | 10:15 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

కోనరావుపేట మండలంలో ఎస్సెస్సీ ఫలితాల్లో మెరుగైన ప్రతిభ

29-04-2026 08:34 PM

10 పాఠశాలలకు 100 శాతం ఉత్తీర్ణత

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని వివిధ పాఠశాలల ఎస్సెస్సీ మార్చి–2026 ఫలితాలు విడుదల కాగా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మండల వ్యాప్తంగా మొత్తం 449 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 441 మంది ఉత్తీర్ణత సాధించి మంచి ఫలితాలను నమోదు చేశారు. ఈ ఏడాది మండలంలో 10 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రత్యేక గుర్తింపు పొందాయి.

విద్యార్థుల విజయానికి ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం కారణమని విద్యాశాఖ అధికారి మురళీ నాయక్ తెలిపారు. మండల టాపర్‌గా కోనరావుపేట మోడల్ స్కూల్‌కు చెందిన బి. విజయ్ 573 మార్కులు సాధించి ప్రథమ స్థానం దక్కించుకున్నాడు. అదే పాఠశాలకు చెందిన జె. వరుణ్ 570 మార్కులు సాధించి ద్వితీయ స్థానం పొందాడు. విద్యార్థుల విజయంపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.