17 August, 2026 | 9:04 AM

ఆర్మీ నేపథ్యంలో మిషన్ 007

26-01-2025 01:12 AM

మహంకాళి పిక్చర్స్ పతాకంపై భరత్ చౌదరి, ప్రియాంక నాంది హీరోహీరోయిన్లుగా వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మిషన్ 007’. ఈ సినిమాను జే మోహన్‌కాంత్ దర్శకత్వం లో మహంకాళి నాగ మహేశ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.

ఈ సందర్భంగా హీరో భరత్ మాట్లాడుతూ.. ‘ఆర్మీ బ్యాక్‌డ్రాప్ అనగానే భయం వేసింది. కానీ డైరెక్టర్‌లోని కాన్ఫిడెన్స్ చూసి నేను ధైర్యం చేశాను’ అని తెలిపారు. హీరోయిన్ ప్రియాంక మాట్లాడుతూ.. ‘కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు దేశభక్తి ఉండటం మా సినిమాకు గర్వకారణం’ అన్నారు.

దర్శకుడు మోహన్ కాంత్ మాట్లాడుతూ.. ‘చిన్న సినిమాలు షూటింగ్ చేస్తే సబ్సిడీ ఇస్తామని మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్ వారు చెప్తే అక్కడి లొకేషన్స్ సెలక్ట్ చేసుకున్నాం’ అని తెలిపారు. నిర్మాత నాగమహేశ్ మాట్లాడుతూ.. ‘సినిమా అవుట్‌పుట్ మీద ఉన్న నమ్మకంతో ముందుగా అనుకున్న బడ్జెట్‌ను క్రాస్ చేసి వెళుతున్నా’ అని చెప్పారు.