ఆయిల్‌పామ్‌తో స్థిరమైన ఆదాయం
- వర్షాభావ పరిస్థితుల్లోనూ ఇబ్బందులుండవు
- ఇక కొనిజర్ల నుంచే విత్తనాలు సరఫరా
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురంలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభం
- హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, జూలై 20(విజయక్రాంతి): ఆయిల్ పామ్‌తో రైతులకు స్థిరమైన ఆదాయం వస్తుందని, వర్షాభావ పరిస్థితు ల్లోనూ ఇబ్బందులుండవని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సాగుకు దేశంలో విస్తారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనా పురం గ్రామంలో రూ.300 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన గోద్రెజ్ ఇంటిగ్రేటెడ్ పామాయిల్ పరిశ్రమను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గోద్రెజ్ మేనేజ్మెంట్ ప్రతినిధులతో కలిసి సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో భట్టి మాట్లాడారు. ఖమ్మం జిల్లా కేవలం వ్యవసాయానికే పరిమితమైన తరుణంలో, ఇక్కడి రైతాంగానికి అధిక దిగుబడి, మెరుగైన రాబడి అందించేందుకు పామ్ ఆయిల్ సాగు ఒక అద్భుతమైన వరమని స్పష్టం చేశారు. ‘ఇక్కడ నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీటి ప్రవాహం, పాలేరు, వైరా రిజర్వాయర్లు.. వీటి మీద ఆధారపడి ఇక్కడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం మన జీవన ఆధారంగా మారిన పరిస్థితుల్లో రైతులకు అధిక దిగుబడి, రాబడి వచ్చేలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
అందులో భాగంగా రైతులు ఆయిల్ పామ్ సాగువైపు వెళ్లాలి’ అని అన్నారు. ఎల్ నినో వంటి విపత్కర పరిస్థితులు, వర్షాభావ స్థితిగతులు ఏర్పడిన ఆయిల్ పామ్ సాగు వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావన్నారు. పామ్ ఆయిల్ సాగును ప్రోత్సహించేందుకు రైతులకి ఎకరానికి రూ.4 వేల నుంచి రూ.45 వేల వరకు సబ్సిడీని కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు దేశంలో 25 లక్షల మి లియన్ టన్ను ల పామ్ ఆ యిల్ అవస రం ఉంటే.. కే వలం 12 ల క్షల మిలియన్ టన్స్ మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు.
కేవలం 3 లక్షల టన్నుల పామాయిల్‌ను దేశం దిగుమతి చేసుకుంటుందని ఆయన అన్నారు. అందుకు 1.5 లక్షల కోట్ల రూపాయలు.. విదేశీ మారకంలో వేరే దేశాలకి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దేశంలో దాదాపు 70 లక్షల ఎకరాలకు సాగు చేయాల్సిన అవసరం ఉంటే.. కేవలం 15 లక్షల ఎకరాల్లో మాత్రమే చేసుకోగలుగుతున్నాం. పూర్తి స్థాయిలో సాగు చేయగలిగితే దేశ ఆర్థిక వ్యవస్థకి దన్నుగా నిలవగలమని ఆయన చెప్పారు. ఆయిల్ పామ్ సాగుకు తెలంగాణతో పాటు దేశంలోనూ మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
2023లో ఒక టన్ను గెల ధర రూ.12,500 ఉంటే ఈరోజు రూ.23 వేల వరకు ఉన్నదని చెప్పారు. ఈ ఇండస్ట్రీ యాంకర్ ఇండస్ట్రీగా మారి అనేక అనుబంధ పరిశ్రమలు ఈ పరిసర ప్రాంతాలకు రావాలని, ఈ ప్రాంతం ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్‌కు మంచి కేంద్రంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. పామ్ ఆయిల్‌కి అవసరమైన విత్తనాలను మలేషి యా, ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితుల నుంచి.. ఇక్కడి నుంచే దేశానికి అవసరమైన విత్తనాన్ని అందిం చే స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. సీడ్ జెనెటిక్స్, సీడ్ గార్డెన్, నర్సరీ, ఆర్ అండ్ డి, మిల్లింగ్ అండ్ రిఫైనింగ్‌కు 113 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.






