02-12-2025 07:26:43 PM
పెద్దపల్లి (విజయక్రాంతి): అంతర్గాం తహసీల్దార్ గా తూము రవీందర్ పటేల్ బాధ్యతలు స్వీకరించి సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బంది మండలంలోని ప్రజలతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలోని ప్రజలు ప్రజాప్రతినిధులు రైతులు సిబ్బంది సహయ సహకారంతో జిల్లా కలెక్టర్ ప్రోద్బలంతో రైతులకు అందుబాటులో ఉండి ఇప్పటికప్పుడు పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్నామని రాబోయే రోజుల్లో కూడా మండల ప్రజల సహకారంతో ఇలాగే విధులు నిర్వహిస్తామని, తనకు సహాయ సహకారాలు అందించిన సిబ్బందికి మండల ప్రజలకు ప్రజాప్రతినిధులకు జిల్లా కలెక్టర్ కు తహసీల్దార్ కృతజ్ఞతలు తెలిపారు.