calender_icon.png 2 December, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిపి ట్రాక్టర్ డ్రైవర్ సర్పంచ్ కు పోటీ

02-12-2025 07:24:04 PM

రిజర్వేషన్ల వల్ల పోటీ చేసేందుకు కలిసి వచ్చిన అవకాశం 

అధికార పార్టీ నేతల మద్దతు

అవకాశం ఇస్తే గ్రామ అభివృద్ధి వృద్ధికి కృషి చేస్తా 

కామారెడ్డి (విజయక్రాంతి): రిజర్వేషన్ల పుణ్యమా అని గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తికి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేసే అవకాశం దక్కిన సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో చోటుచేసుకుంది. రిజర్వేషన్ల వల్ల రాజకీయాల్లో సముచిత స్థానం లభిస్తుందనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. నిన్న మొన్నటి వరకు గ్రామంలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తికి కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేసే అవకాశం ఎస్సీ రిజర్వేషన్లు వల్ల కలిసి వచ్చిందని గ్రామస్తులు తెలిపారు.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రామారెడ్డి మండలం పోసానిపేట పంచాయితీలో సర్పంచ్ స్థానం ఎస్సి జనరల్ కు రిజర్వేషన్ కావడంతో జిపి ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసిన పళ్లెం లింగం సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. జిపి ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేయడంతో లింగం గ్రామస్తులందరితో కలుపుగోలుగా ఉండడంతో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయకులు జిపి ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసిన లింగంకు మద్దతు ఇచ్చి సర్పంచ్ గా నిలబడితే గెలుపు సునాయాసమవుతుందని గ్రామస్తులు భావించారు. ప్రస్తుతం సర్పంచ్ బరిలో లింగం నిలిచారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దృష్టికి స్థానిక కాంగ్రెస్ నాయకులు జిపిలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తికి పార్టీ మద్దతి ఇస్తే సర్పంచ్ గా సునాయాసంగా గెలుస్తారని చెప్పడంతో ఎమ్మెల్యే అందుకు సానుకూలంగా స్పందించారు. జిపి ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తికి ఎన్నికల్లో గెలుపొందితే సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.