02-12-2025 07:28:59 PM
నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో బుధవారం పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం నిర్మల్ జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జ్ కూచాడి శ్రీహరి రావు నివాసంలో తేనేటి విందుకు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రికి పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. స్థానిక సంస్థల ఎన్నికలపై శ్రీహరిరావుతో మంత్రి చర్చించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్ భీమ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు.