5 May, 2026 | 7:50 PM

సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత

05-05-2026 06:39 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ కార్యాలయాలలో పని చేసే అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని కలెక్టర్ హరిత అన్నారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ భవనంలోని జిల్లా భూ కొలతల అధికారి కార్యాలయం, జిల్లా సహకార శాఖ అధికారి కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది హాజరు రిజిస్టరును పరిశీలించి సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు సిబ్బంది సమయ పాలన పాటించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. సమయ పాలన పాటించని సిబ్బంది పై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ  సంబంధిత శాఖల అధికారులు, ఉద్యోగులు తడితరులు పాల్గొన్నారు.