1 April, 2026 | 2:36 AM

షాద్‌నగర్ చౌరస్తా విస్తరణకు రంగం సిద్ధం

01-04-2026 12:31 AM
  1. మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ 

చౌరస్తా ప్రాంగణాన్ని పరిశీలించిన హెచ్‌ఎండీఏ ఏఈ విశ్వతేజ 

షాద్‌నగర్, మార్చి 31 (విజయక్రాంతి): ఎంతోకాలంగా షాద్ నగర్ పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్న చౌరస్తా విస్తరణ కార్యక్రమం త్వరలోనే అధికారులు చేపట్టే అవకాశాలు ఉన్నాయని షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ స్పష్టం చేశారు. మంగళవారం పట్టణ చౌరస్తాలో హెచ్‌ఎండిఏ శాఖకు చెందిన ఏఈ విశ్వతేజ సందర్శించి ప్రాంగణాన్ని పరిశీలించారు.

చౌరస్తా విస్తరణలో భాగంగా సదర్ ప్రాంతాన్ని తిలకించారు. ఈ సందర్భంగా చౌరస్తా గురించి స్థానిక మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్,  కౌన్సిలర్లు  తదితరులు వారి వెంట ఉన్నారు.

ఎంతోకాలంగా చౌరస్తా విస్తరణ పనులు చేపట్టేందుకు రంగం సిద్ధం అయ్యిందని అయితే అన్ని అవసరాలకు అనుగుణంగా ప్రజల సౌకర్యార్థం చేపట్టబోయే పనులు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలబడతాయని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కృషితో పట్టణ అభివృద్ధికి పూర్తి సహకారం ప్రజలు వ్యాపారస్తులు అందిస్తున్నారని చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్  ఆశాభావం వ్యక్తం చేశారు.