1 April, 2026 | 2:32 AM

కామారెడ్డి రూరల్ సీఐ రామన్ బదిలీ

01-04-2026 12:32 AM

కామారెడ్డి, మార్చి 31 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లోని కామారెడ్డి రూరల్ సిఐ గా పని చేసిన రామన్ మంగళవారం బదిలీ అయ్యారు.  కామారెడ్డి జిల్లా సదాశివనగర్ , సీఐగా పనిచేసి కామారెడ్డి రూరల్ సిఐ గా బదిలీ అయ్యారు. రూరల్ సీఐ గా విధులు నిర్వహిస్తున్న రామన్ బదిలీ అయ్యారు. ఇక్కడ దాదాపు రెండేళ్ల పాటు పనిచేసిన ఆయన బదిలీపై వెళ్లారు. కామారెడ్డి రూరల్ సీఐ రామన్  హైదరాబాద్లోని ఐజి  కార్యాలయానికి ప్రభుత్వం బదిలీ చేసింది.

కామారెడ్డి రూరల్ సిఐగా పనిచేయడానికి అనేకమంది తమ ప్రయత్నాలు కొనసాగించినట్టుగా ప్రచారం సాగుతుంది. గత కొద్ది కాలంగా రూరల్ సీఐ బదిలీ అవుతారని ప్రచారం నేపథ్యంలో ఇక్కడ వచ్చే అధికారులు పేర్లు చెక్కర్లు   కొట్టాయి. సదాశివ నగర్ సిఐ గా రామన్ పని చేసినప్పుడు అందరికీ ఆదర్శవంతముగా పనిచేశాడు.

ఫ్రెండ్లీ పోలీస్ గా బాధ్యతలు చేపట్టి అనంతరం కామారెడ్డి రూరల్ సిఐగా రామన్ ప్రజలతో ఎంతో చనువుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. బెస్ట్ సిఐగా పేరు తెచ్చుకున్న రామన్ బదిలీ కావడం తో ప్రజలు ఆయన చేసిన సేవలను చర్చించుకుంటున్నారు. కామారెడ్డి రూరల్, సీఐగా రామన్ బాధ్యతలు చేపట్టి రెండున్నర ఏండ్లు కామారెడ్డి ప్రశాంత వాతావరణ నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. సీఐ రామన్ బదిలీ కావడం పట్ల కామారెడ్డి జిల్లా ప్రజలు తమ బాధ వ్యక్తం చేస్తున్నారు. సిఐ రామన్ ఎక్కడున్న పదోన్నతి  పొంది డిఎస్పీగా కామా రెడ్డి కి రావాలని ఆశిస్తున్నామని కామారెడ్డి రూరల్ నాయకులు, ప్రజలు పేర్కొన్నారు.