కల్కి 2లోకి ఎంట్రీ!
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ‘కల్కి-2’ ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ ‘కల్కి’కి సీక్వెల్‌గా రూపొందుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొద్దికాలంగా సీక్వెల్‌కు సంబంధించి సోషల్ మీడియాలో చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకా రం.. ఆలియా ఇందులో ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తోంది. గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన రెండో షెడ్యూల్‌లో ఆమె ఐదు రోజుల పాటు సైలెంట్‌గా షూటింగ్‌లో కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో చాలా ప్రాముఖ్యత గల ‘సుమతి’ పాత్రపైన కూడా స్పష్టత వచ్చింది. ఈ పాత్ర కథను మరోస్థాయికి తీసుకెళ్లేలా ఉండబోతోందట. తొలిభాగంలో దీపికా పదుకొణె పోషించిన సుమతి పాత్ర కోసం ఆలియా భట్‌ను అనుకుంటున్నట్టు ఇప్పటిదాకా వార్తలు వచ్చాయి.
అయితే, ఆమె సుమతి పాత్ర చేయడం లేదటని టాక్. ఆలియా కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ అత్యంత కీలకమైన ఒక ప్రత్యేక పాత్రను డిజైన్ చేశారట. పార్ట్-2లో ‘సుమతి’ పాత్రను తొలగిస్తున్నారని, దీపికా పదుకొణె స్థానంలో సాయిపల్లవిని తీసుకుంటున్నారనే వార్తలను దర్శకుడు నాగ్‌అశ్విన్ ఇటీవల పూర్తిగా ఖండించారు. కథకు అత్యంత కీలకమైన సుమతి పాత్రను తొలగించే ప్రసక్తే లేదని, సాయిపల్లవిని సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు ముఖ్యమైన షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి నాన్‌స్టాప్ షూటింగ్ జరిపి, మిగిలిన భాగాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది.






