calender_icon.png 13 February, 2026 | 12:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న రాష్ట్ర సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

13-02-2026 12:00:00 AM

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 12, (విజయక్రాంతి): దేశవ్యాప్త జరుగుతున్న సార్వత్రిక సమ్మెను చుంచు పల్లి మండలం సిపిఐ పార్టీ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ యూనియన్, ఆశ వర్కర్స్, అంగనవాడి, పంచాయతీ కార్మికుల ధర్నా నిర్వహించారు.సమ్మె లో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర. కార్యదర్శి కూనం నేని సాంబశివరావు... కూనం నేని మాట్లాడుతూ...

కేంద్ర ప్రభుత్వం  44 కార్మిక చట్టాలను 4 చట్టాలుగా రూపొందించినదాని , కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల వారి పొట్ట కొడుతుందని తెలిపారు. నేడు దేశ వ్యాప్త సమ్మె లో ఎప్పుడు లేని విధంగా సింగరేణి బొగ్గు బావుల కార్మికులు స్వచ్చందంగా పాల్గొన్నారని, ఆశ వర్కర్లు, అంగనవాడి లు, పంచాయతీ కార్మికులు పాల్గొంటున్నారని తెలిపారు.

దేవుడు మోడీ కి ఒక్కడే దేవుడు కదూ, శ్రీ రాముడు మోదీ  కె కదూ ప్రజలందరికి శ్రీ రాముడు అని ఏద్దెవా చేసారు.కార్మిక, ప్రజా, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలనువెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు.ఈ.కార్యక్రమం  ఏఐటీయూసీ యూనియన్,ఆశ వర్కర్లు, అంగనవాడి, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.