పనకబండ విద్యార్థినికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో సాధించిన బత్తిని తేజశ్రీ
మోత్కూరు, ఏప్రిల్ 13(విజయక్రాంతి): మోత్కూరు మండలం పనకబండ గ్రామానికి చెందిన బత్తిని తేజశ్రీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించింది.మొత్తం 440 మార్కులకు గాను 438 మార్కులు సాధించి తన ప్రతిభను చాటుకుంది. తేజశ్రీ తండ్రి బత్తిని ప్ర భాకర్, తల్లి బత్తిని స్వప్న సోమవారం విలేకరులకు తెలిపారు.
చిన్ననాటి నుంచే చదు వుపై ఆసక్తి కలిగిన తేజశ్రీ ప్రతి తరగతిలోనూ అగ్రస్థానంలో నిలుస్తూ ముందుకు సాగిందన్నారు. విద్యాభ్యాసం విషయానికి వస్తే, 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు మోత్కూరులోని సేక్రెడ్ హార్ట్ హై స్కూల్లో, 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మోటకొండూర్‌లోని ఎంజేపీ పాఠశాలలో చదివింది.
ప్రస్తుతం జనంపల్లిలోని సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అభ్యసిస్తోంది.రాష్ట్ర స్థాయిలో ప్రథ మ ర్యాంక్ సాధించడం ద్వారా తేజశ్రీ తన గ్రామానికి, మండలానికి గౌరవం తీసుకువచ్చింది. ఈ సందర్భంగా తేజస్వి మాట్లా డుతూ నా విజయానికి కారణమైన మా బాబాయ్ బత్తిని రాజుగౌడ్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతూ బత్తిని తేజశ్రీ ఈ సందర్భంగా గ్రామస్థులు, ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు. భవి ష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.






