14 April, 2026 | 4:19 AM

జగిత్యాలలో కేసీఆర్ సభకు ఏర్పాట్లు

14-04-2026 01:57 AM

నియోజకవర్గాల వారీగా ఇంఛార్జీలను ప్రకటించిన కేటీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంఛార్జులను ప్రకటించారు. జగిత్యాల జిల్లాలోని ఐదు నియో జకవర్గాలకు సంబంధించి ప్రత్యేక ఇం ఛార్జీలను కేటీఆర్ ఖరారు చేశారు.

జగిత్యాలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి (ఎమ్మెల్యే, జనగామ), కోరుట్లకు ప్రశాంత్ రెడ్డి (ఎమ్మెల్యే, బా ల్కొండ), ధర్మపురికి రవీందర్‌రావు (ఎంఎ ల్సీ), వేములవాడకు బాల్క సుమన్ (మాజీ ఎమ్మెల్యే), చొప్పదండికి పెద్ది సుదర్శన్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే)ప్రకటించారు. జనస మీకరణ, ప్రాంగణ ఏర్పాట్లు, నిర్వహణ బాధ్య తలను సీనియర్ నేతలు గాదరి బాలమ ల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పర్యవేక్షించనున్నారు.