calender_icon.png 18 October, 2025 | 9:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్టహాసంగా రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు ప్రారంభం

18-10-2025 06:24:33 PM

రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఉమ్మడి జిల్లాల బాలికలు..

రాజాపూర్: రాష్ట్రస్థాయి 69వ ఎస్ జి ఎఫ్ అండర్ 17 బాలికల వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు శనివారం మండలంలోని తిరుమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. క్రీడా పోటీలలో పాల్గొనేందుకు తెలంగాణ ఉమ్మడి జిల్లాలకు చెందిన 10 జట్లు క్రీడా పోటీల్లో పాల్గొన్నాయి. కార్యక్రమంలో భాగంగా బాలానగర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల విద్యార్థినులు, రాజాపూర్ కేజీబీవీ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన పరేడ్, నృత్య ప్రదర్శనలు అహుతులను ఆకట్టుకున్నాయి.

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన 12 మందితో కూడిన రెండు జట్లను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికైన రెండు జట్లు నవంబర్ 13,14,15 న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగు జాతీయస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ శారద బాయి, ఎంఈఓ సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల ఎంఈఓ మంజుల,జనం పల్లి శశికళ రెడ్డి, శేఖర్ గౌడ్, బచ్చిరెడ్డి, యాదయ్య, వెంకటేష్, రామకృష్ణ గౌడ్,సత్యనారాయణ గౌడ్,కృష్ణయ్య,నరేష్,యాదగిరి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.