calender_icon.png 18 October, 2025 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థినీలు

18-10-2025 06:26:59 PM

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల సైనిక పాఠశాల, కళాశాల విద్యార్థినీలు..

ఘట్ కేసర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలో ఘట్ కేసర్ మున్సిపల్ అంకుశాపూర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల సైనిక్ పాఠశాల, కళాశాల విద్యార్థినీలు ఎంపికయ్యారు. ఇంటర్ చదువుతున్న విజయలక్ష్మి, అక్షయ శుక్రవారం జరిగిన రంగారెడ్డి టీమ్ జిల్లా సెలక్షన్స్ లో ఉత్తమ ప్రతిభకనబరచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం సంతోషం కలిగించిందని కళాశాల ప్రిన్సిపాల్ జూపల్లి రేణుక తెలిపారు. పి.ఈ.టి నవనీతకు అభినందనలు తెలియచేశారు. రాష్ట్ర స్థాయి వాలీబాల్ ఎస్ జీ ఎఫ్ - అండర్ 19 బాలికల విభాగంలో ఈ ఇద్దరు విద్యార్థినీలు ఎంపిక కావడం సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం చాల సంతోషకరమని కళాశాల ప్రిన్సిపాల్ జూపల్లి రేణుక సంతోషాన్ని వ్యక్తం చేశారు.