calender_icon.png 18 October, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

18-10-2025 06:22:40 PM

జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నిరుపేదల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధి పొందిన వారు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జూమ్ మీటింగ్ ద్వారా జిల్లాలోని అన్ని మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రోగ్రాం అధికారులు, ఐ కె పి  ఏ పి ఎం లు, గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, పంచాయితీల పరిధిలో ఆస్తి పన్ను వసూలు, పారిశుద్ధ్యం, వారసంత వేలం డబ్బుల వసూలు, వ్యక్తిగత మరుగుదొడ్, పంచాయతీ కార్యదర్శుల హాజరు అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో జిల్లాలో లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్లలో పనులు మొదలు పెట్టని 2 వేల 745 ఇండ్లకు సంబంధించి ఈ నెల 23వ తేదీ వరకు పనులు ప్రారంభించేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రధానమంత్రి జన్ మన్ పథకం క్రింద పి.వి.పి.జి లకు మంజూరైన ఇళ్లను త్వరగా పనులు ప్రారంభించాలని తెలిపారు. మండల సమాఖ్య నుండి లబ్ధిదారులకు కొంత రుణం అందించాలని, గ్రామపంచాయతీలో 2025 - 26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తిపన్నులు వసూలు చేయాలని, గ్రామ పంచయతీల పరిధిలో పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగించాలని తెలిపారు.

వర్షాకాలం ముగిసినందున గ్రామాలలో రహదారులపై ఉన్న గుంతలను వెంటనే పూడ్చాలని, జిల్లాలోని వారసంతలను వేలంలో దక్కించుకున్న వారి నుండి వాయిదా సొమ్మును వసూలు చేసి గ్రామపంచాయతీ అభివృద్ధికి వినియోగించాలని తెలిపారు. ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని, మరుగుదొడ్లు లేని గృహాలను గుర్తించి జాబితా సిద్ధం చేయాలని తెలిపారు. పంచాయితీ కార్యదర్శుల హాజరుపై మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పి. డి. వేణుగోపాల్, డివిజనల్ పంచాయతీ అధికారి ఉమర్ హుస్సేన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.