28 April, 2026 | 2:52 AM

ఆస్తమాకు అత్యాధునిక చికిత్సా విధానాలు

28-04-2026 12:45 AM

యశోద హాస్పిటల్స్- హైటెక్ సిటీలో జాతీయ సదస్సు 

లైవ్ వర్క్ షాప్ నిర్వహణ

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): యశోద హాస్పిటల్స్- హైటెక్ సిటీ, అకాడమీ ఫర్ అడ్వాన్స్‌డ్ పల్మనరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఏఏపీఈఆర్) సహకారంతో సీవియర్ ఆస్తమా ప్రీసెప్టర్షిప్ ప్రోగ్రామ్ అండ్ లైవ్ వర్క్ షాప్ సదస్సును యశోద హాస్పిటల్స్ -హైటెక్ సిటీలో విజయవంతంగా నిర్వహించారు.

దేశవ్యాప్తంగా 400+ పైగా డెలిగేట్స్, పల్మనాలజిస్టులు, మెడికల్ విద్యార్థులు పాల్గొన్న ఈ సదస్సు, తీవ్రమైన ఆస్తమా నిర్ధారణ, నిర్వహణ వైద్య విధానాలపై ప్రిసిషన్ మెడిసిన్ విధానాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహించారు. యశో ద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ జీఎస్ రావు, ముఖ్య అతిథిగా సదస్సును ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ, తీవ్రమైన ఆస్తమా ఇంకా ఒక ప్రధాన ఆరోగ్య స మస్యగానే కొనసాగుతోందన్నారు.

అధునాతన చికిత్సా విధానాలు అందుబాలో ఉన్నప్పటికీ సరైన గుర్తింపు లేకపోవ డం, ఫీనోటైపింగ్, అత్య ఆధునిక చికిత్సా విధానాల అవ గాహన లేకపోవడం వల్ల రోగులు ఇబ్బందు లు పడుతున్నారన్నారు. ప్రాక్టికల్, కేస్-బేస్డ్ లర్నింగ్‌తో కూడిన ఈ ప్రీసెప్టర్షిప్ ద్వారా ప్రత్యేక వైద్య విద్యను ప్రోత్సహించి, ప్రెసిషన్ రెస్పిరేటరీ కేర్ ద్వారా రోగుల వైద్య ఫలితాలను మెరుగుపర్చాలనే మా ముఖ్య ఉద్దే శ్య మని డాక్టర్ జీఎస్ రావు తెలిపారు.

యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మో నాలజిస్ట్ డాక్టర్ వీ నాగా ర్జున మాటూరు మాట్లాడుతూ తీవ్రమైన ఆస్తమా నిర్వహణలో ఫీనోటైపింగ్, బయో మార్కర్స్, బయోలాజిక్ థెరపీలు ఆధునిక పద్దతులను ఉపయోగిస్తున్నామని ఈ ప్రీసెప్టర్షిప్ ద్వారా వైద్యులకు ప్రాక్టికల్, కేస్-బేస్డ్ అనుభవం అందించి, వ్యక్తిగతీకరించిన చికి త్సా విధానాలను అమలు చేసే సామర్థ్యాన్ని పెంపొందించడమే మా లక్ష్యమన్నారు.

యశోద హాస్పిటల్స్ గత ఐదేళ్లుగా ప్రత్యేక తీవ్రమైన ఆస్తమా క్లినిక్‌ను నిర్వహిస్తూ దేశంలోనే ప్రారంభమైన నిర్మిత క్లినిక్‌లలో ఒకటిగా ని లిచిందని, ఈ క్లినిక్ ద్వారా అడ్వాన్స్‌డ్ ఫీనోటైపింగ్, బయోమార్కర్ ఆధారిత చికిత్సా, బ యోలాజిక్ థెరపీలు, మల్టీడిసిప్లినరీ కేర్ అం దిస్తున్నామన్నారు. ఈ సదస్సులో తీవ్రమైన ఆస్తమా నిర్వచనం, భారతీయ పరిస్థితుల్లో ఫీనోటైపింగ్, చికిత్సా ఆప్టిమైజేషన్, ఏబీపీఏ, ఈజీపీఏ వంటి ఈసినోఫిలిక్ లంగ్ డిసీజెస్, బయోలాజిక్స్ వినియోగం, ఆస్తమా రిమిషన్ లక్ష్యం వంటి అంశాలపై నిపుణుల సెషన్స్ నిర్వహించబడ్డాయి.

ఇంటరాక్టివ్ కేస్ డిస్కషన్స్, ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయన్నారు. ఈ ప్రీసెప్టర్షిప్ ప్రాక్టికల్ లెర్నింగ్‌ను ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ఎఫ్‌ఈఎన్‌ఓ, ఆక్సిలోమెట్రీ, స్పుటమ్ ఇన్ఫ్లమోమెట్రీ, బ యోలాజిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి ఆధునిక పద్ధతులపై వర్క్ సెషన్లను ఏర్పాటు చేసి అవ గాహన కల్పించారు. 12 జాతీయ, అంతర్జాతీయ మెడికల్ కంపెనీల ఆధునిక పరిక రా లతో ఏర్పాటు చేసిన ఈ సెషన్స్‌ను ఆధునిక ఆస్తమా చికిత్సలో ఉపయోగించే టెక్నాలజీలపై హ్యాండ్స్-ఆన్ ట్రైనింగ్ అందించినట్లు డాక్టర్ నాగార్జున మాటూరు తెలిపారు.