calender_icon.png 26 September, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి దామోదర్‌ను కలిసిన రాష్ట్ర ఫార్మసి కౌన్సిల్ సభ్యులు

26-09-2025 12:56:13 AM

చేగుంట, సెప్టెంబర్ 25 :తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మెంబర్, తెలంగాణ రాష్ట్ర కోశాధికారి, మెదక్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అధ్య క్షులు తొడుపునూరి రాజు ఆధ్వర్యంలో ప్రపంచ ఫార్మసిస్ట్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు, తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సిం హ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రిని సన్మానించి కేకు కట్ చేయడం జరిగింది. ఈ సందర్బంగా మంత్రితో ఫార్మసీ కౌన్సిల్, ఫార్మసిస్టులకు సంబంధించిన సమస్యలు చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్లు పాల్గొన్నారు.