26-09-2025 12:57:37 AM
రామకృష్ణాపూర్,(విజయాక్రాంతి): వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులను అప్రమత్తంగా ఉండాలి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. గురువారం మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట గాంధారిఖిల్లా గుట్ట సమీపంలో గల మేడి చెరువును సందర్శించారు. చెరువు తూముకు గండి పడినందున తహసిల్దార్ సతీష్, నీటిపారుదల శాఖ డిఈ శారదలను పరిస్థితులకు గల కారణాలను ఆడిగి తెలుసుకున్నారు.వరద నీటి ప్రవాహం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఏర్పడకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని అలాగే ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.