26-09-2025 12:56:05 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్‌కు సంబంధించి రాష్ర్ట ప్రభుత్వం గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. 2,620 మద్యం దుకాణాలకుగానూ శుక్రవారం నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చే నెల 23న లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయించనున్నారు. రెండేండ్ల కాలానికి (2025, డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు) అనుమతులతో ఎక్సుజ్ శాఖ కొత్త లైసెన్సులు జారీ చేయనుంది.
నూతన మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుమును రూ.3 లక్షలుగా నిర్ణయించారు. క్రితంసారి ఇది రూ.2 లక్షలుగా ఉండగా, ఇప్పుడు అదనంగా లక్ష పెంచారు. ఎక్సుజ్ చట్టం 1968 ప్రకారం శిక్షపడిన వారు, ప్రభుత్వానికి బకాయిలు పడి సక్రమంగా చెల్లింపులు చేయని వారు దుకాణాలు పొందేందుకు అనర్హులుగా అబ్కారీ శాఖ ప్రకటించింది. లిక్కర్ దుకాణాల కేటాయింపులో గౌడ్ సామాజిక వర్గానికి 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 2,620 మద్యం దుకాణాలకుగానూ గౌడ సామాజికవర్గానికి 393 షాపులు, ఎస్సీలకు 262, ఎస్టీలకు 132 మద్యం షాపులు దక్కనున్నాయి.
ఏపీవారి నుంచి దరఖాస్తులొచ్చేనా?
తెలంగాణ రాష్ర్టమంతటా దుకాణాలను ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకే తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం రాత్రి 11 గంటల వరకు అమ్మకాలు సాగించే వెసులుబాటు కల్పించారు. రూ.5 లక్షలు అదనంగా చెల్లిం చి వాక్-ఇన్ స్టోర్ తరహాలో మద్యం దుకాణాన్ని నిర్వహించుకొనే వెసులుబాటు కల్పిం చారు. అయితే క్రితంసారి మద్యం దుకాణాల కోసం 1,31,490 దరఖాస్తులొచ్చాయి.
వీటి రూపంలోనే రూ.2,629 కోట్లు ఖజానాకు చేరాయి. ఈసారి దరఖాస్తు రుసుము ను రూ.లక్ష పెంచినా అంతమేర ఆదాయం రాకపోవచ్చనే చర్చ సాగుతోంది. క్రితంసారి ఏపీ ప్రాంత వ్యాపారులు పెద్ద ఎత్తున దరఖాస్తులు దాఖలు చేశారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట మద్యం విధానంలో మార్పులు చేయడంతో అక్కడి వ్యాపారులు తెలంగాణ రాష్ర్టంలో అంతగా ఆసక్తి చూపకపోవచ్చనే ప్రచారం సాగుతోంది.
అమ్మకాలు 10 రెట్లు దాటితే.. అదనంగా 10 శాతం వసూలు
గతంలో మాదిరిగానే 2011 సంవత్సర జనాభా ప్రాతిపదికన మద్యం దుకాణాలకు రిటైలర్‌షాప్ ఎక్సు జ్ ట్యాక్స్ (ఆర్‌ఎస్‌ఈటీ)ని ఖరారు చేశారు. ఆరు శాబులుగా నిర్ణయించారు. ఈ నే పథ్యంలో రిజర్వేషన్ దరఖాస్తుదారులకు కుల ధ్రువీకర ణ తప్పనిసరి చేశారు. ఇక మద్యం దుకాణం టర్నోవర్ వార్షిక లైసెన్స్ రుసుముకు విక్రయాలు 10 రెట్లు దాటితే అదనంగా 10 శాతం షాప్ టర్నోవర్ ట్యాక్స్‌ను వసూలు చేస్తారు.
స్పెషల్ రిటైల్ ఎక్సుజ్ ట్యాక్స్ ఏటా రూ.5 లక్షలుగా నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీకి అవతల ఐదు కి.మీ. పరిధిలోని దుకాణాలకు జీహెచ్‌ఎంసీలోని దుకాణాల లైసెన్స్ రుసుమే ఉంటుంది. ఇదే నియమం తెలంగాణలోని మిగిలిన కార్పొరేషన్లకూ వర్తించనుంది. మున్సిపాలిటీ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఈ పరిధిని రెండు కి.మీ.గా నిర్ణయించారు.
జనాభా దరఖాస్తు ఫీజు
5 వేల లోపు : రూ.50 లక్షలు
5 వేల నుంచి 50 వేలు : రూ.55 లక్షలు
50 వేల నుంచి లక్ష : రూ.60 లక్షలు
1 లక్ష నుంచి 5 లక్షలు : రూ.65 లక్షలు
5 లక్షల నుంచి 20 లక్షలు : రూ.85 లక్షలు
20 లక్షలకు పైగా : రూ.కోటి 10 లక్షలు
దరఖాస్తుల ప్రక్రియ ఇలా..
ప్రారంభం : సెప్టెంబర్ 26
చివరి తేదీ : అక్టోబర్ 18
డ్రా తీసే తేదీ : అక్టోబర్ 23
కాలపరిమితి : 2025, డిసెంబర్ 1 నుంచి 2027, నవంబర్ 30