12 March, 2026 | 10:51 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన రాష్ట్ర టీపీసీసీ కార్యదర్శి ‘బద్దం’

30-01-2026 12:00 AM

భిక్కనూర్, జనవరి 29 (విజయ క్రాంతి):  భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ముద్రకోల భార్య-భర్తలు బాలరాజు, మంజుల మెదక్ జిల్లాలో మంగళవారం జరిగిన ఘోర రోడుప్రమా దంలో  మృతిచెందారు. ఈ ప్రమాదంలో వారి కుమారుడు ముద్ర కోల అభిలాష్ తీవ్రంగా గాయపడి కామారెడ్డి మెడికేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ విషాదానికి స్పందిస్తూ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని అభిలాష్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. డాక్టర్లను సంప్రదించి, గాయపడ్డ వ్యక్తికి అత్యుత్తమ వైద్యసేవలు అందించాలన్న సూచనలు చేశారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇంద్రకరణ్ రెడ్డి, కుటుంబానికి అన్ని సందర్భాలలో మద్దతుగా ఉంటానని భరోసా ఇచ్చారు.