21 March, 2026 | 6:04 AM

మినరల్ వాటర్ ప్లాంటును ప్రారంభించిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి సూర్య

21-03-2026 01:12 AM

కన్నాయిగూడెం, మార్చి20 (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని రాజన్నపేట గ్రామంలో యునైటెడ్ వే అఫ్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో 20లక్షలతో నిర్మించిన వాటర్ ప్లాంటును శుక్రవారం రోజు రాష్ట్ర కాంగ్రెస్ యువజన కార్యదర్శి కుంజా సూర్య ప్రారంభించారు.

ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ కన్నాయి గూడెం మండలంలో ఉన్న ప్రజా సమస్యలను మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లి ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని, కన్నాయిగూడెం మండలాన్ని అభివృద్ధిలో ముందుంచే విధంగా కృషి చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో కన్నాయిగూడెం మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు ఎండీ అప్సర్ పాషా, మండల ఇంచార్జి (సర్పంచ్)జాడి రాంబాబు, రాజన్నపేట సర్పంచు పోడెం నర్సింహారావు, వార్డు మెంబర్ కొయ్యల మహేష్, ఆర్టీఏ రాష్ట్ర డైరెక్టర్ వసంత శ్రీనివాస్, గ్రామ కాంగ్రేస్ నాయకులు పాల్గొన్నారు.