6 July, 2026 | 2:23 AM

వికలాంగుల పెన్షన్ పెంపు కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం

06-07-2026 01:15 AM

వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాలపై 

జూలై 28-30 తేదీల్లో బోధన్‌లో రాష్ట్ర సదస్సు

33 జిల్లాల నుండి 500 మంది ప్రతినిధులు హాజరు

ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. అడివయ్య

బోధన్, జూలై 5 (విజయక్రాంతి): వికలాంగుల పెన్షన్ పెంపు కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని, జూలై 28-30 తేదీల్లో బోధన్ పట్టణంలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య తెలిపారు. బోధన్ పట్టణంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాదు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.   సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అయన మాట్లాడుతూ.. వికలాంగుల పట్ల సమాజంలో చిన్నచూపు, వివక్షత, నిర్లక్ష్యం కొనసాగుతుందని అన్నారు.

ఐక్య రాజ్య సమితి హక్కుల ఒప్పందం ప్రకారం అంగవైకల్యం కలిగిన పిల్లలు సకలాంగులతో సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2027 అమలులోకి వచ్చి 9 ఏండ్లు అవుతున్న అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన యాంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ విద్యా సంస్థ ప్రతి జిల్లాలో వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు యం బస్వరాజు పాటిల్, నిజామాబాదు జిల్లా అధ్యక్షులు గైని రాములు, కార్యదర్శి యేశాల గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ నజీర్, జిల్లా సహాయ కార్యదర్శి దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.